హైద్రాబాద్ నాగోల్‌లోని నాగార్జున స్కూల్ భవనం నాలుగో అంతస్తు నుండి ప్రమాదవశాత్తు పడిన 9వ తరగతి విద్యార్ధిని వినీత గురువారం నాడు మృతి చెందారు.
హైదరాబాద్: హైద్రాబాద్ నాగోల్‌లోని నాగార్జున స్కూల్ భవనం నాలుగో అంతస్తు నుండి ప్రమాదవశాత్తు పడిన 9వ తరగతి విద్యార్ధిని వినీత గురువారం నాడు మృతి చెందారు.
స్కూల్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకొంది. ప్రమాదవశాత్తు బాలిక నాలుగో అంతస్తు నుండి కింద పడింది.ఈ విషయాన్ని గుర్తించిన పాఠశాల సిబ్బంది సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు.
కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. స్కూల్‌లోని తన క్లాస్ రూమ్‌లోకి వినీత వెళ్లే సమయంలో ప్రమాదవశాత్తు కింద పడింది. ఈ భవనానికి సరైన ప్రహారగోడ లేదని స్థానికులు చెబుతున్నారు.
అయితే ప్రహారీగోడ ఎత్తు ఎక్కువగా లేదు. ఈ కారణంగా వినీత ప్రమాదవశాత్తు కిందపడినట్టుగా స్థానికులు చెబుతున్నారు. నాలుగో అంతస్తు నుండి కిందపడిన వెంటనే పాఠశాల సిబ్బంది కామినేని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.
