యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నక్కవాగులో  బైక్ తో సహా కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు కాపాడారు.

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం గోవిందాపురం నక్కవాగు తండాలో బైక్ తో సహా ఓ వ్యక్తి గురువారంనాడు కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు  తాళ్ల సహాయంతో  ఆ వ్యక్తిని కాపాడారు.

నాలుగైదు  రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల  అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి.