తాండూరులో టెన్త్ పేపర్ లీక్ ప్రచారం: పోలీసుల దర్యాప్తు
వికారాబాద్ జిల్లాలో టెన్త్ పేపర్ లీక్ అయిందని జరుగుతున్న ప్రచారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ విషయమై డీఈఓ రేణుకాదేవి కలెక్టర్ నారాయణరెడ్డితో సమావేశమయ్యారు.
వికారాబాద్: జిల్లాలోని తాండూరు నెంబర్ వన్ స్కూల్ లో టెన్త్ ప్రశ్నాపత్రం లీక్ అయిందనే ప్రచారంపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇవాళ ఉదయం తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
టెన్త్ పరీక్షలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ స్కూల్ నుండి పేపర్ వాట్సాప్ లో బయటకు వచ్చిందనే ప్రచారం సాగుతుంది. ఈ విషయమై పోలీసులు విచారణను ప్రారంభించారు. ఈ స్కూల్ కు చెందిన ఓ టీచర్ నుండి పేపర్ బయటకు వచ్చిందనే ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంపై వాస్తవాలను తెలుసుకొనేందుకు పోలీసులు ఈ స్కూల్ వద్దకు వచ్చి విచారణను ప్రారంభించారు. టెన్త్ పేపర్ లీక్ జరిగిందనే ప్రచారంపై జిల్లా అధికారులు కూడ అప్రమత్తమయ్యారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో డీఈఓ రేణుకాదేవి సమావేశమయ్యారు.