సంగారెడ్డి పట్టణ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ మార్చ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ది అంతా దోపిడీ రాబడి అంటూ సంచలన ఆరోపించారు. కేసీఆర్ మనసు క్రూరమైనదంటూ విమర్శించారు.

మరోసారి BRS ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. సంగారెడ్డి పట్టణ కేంద్రంలో బీజేపీ నిర్వహిస్తున్న నిరుద్యోగ మార్చ్ గురువారం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ ది అంతా దోపిడీ పాలన అంటూ ఆరోపించారు. సీఎం కేసీఆర్ ని యూజ్ లెస్ అనీ, అతని ప్రభుత్వం హోప్ లెస్ అని ఎద్దేవా చేశారు. 

గతంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ప్రకటించి.. ఇప్పుడు 60, 70 వేలే ఉన్నాయని అంటున్నారనీ, సీఎం కేసీఆర్ ఎగ్జామ్ పేపర్లన్నీ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. విజయశాంతి సీఎం కేసీఆర్ ను విమర్శిస్తూ.. సీఎం కేసీఆర్ నీకు సిగ్గుందా? నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కష్ట పడ్డ 30 లక్షల మంది జీవితాల్ని ఆగం చేశారనీ, తన కూతురు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోగానే ఏదో ఒకటి లీక్ చేస్తాడనీ ఆరోపించారు. అలాగే.. కేసీఆర్ క్రూరుడని, ఆయన కూతురు లిక్కర్ స్కామ్ రాణీ అనీ, కొడుకు కేటీఆర్ పేపర్ లీక్ వీరుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దేశంలో ప్రతిపక్షాలకు డబ్బులు ఇస్తున్నారనీ ఆరోపించారు. బండి సంజయ్ ని అక్రమంగా జైలులో పెట్టారన్నారు. మనుగోడులో డబ్బు, మద్యంతో గెలిచారని దుయ్యబట్టారు విజయశాంతి.

మనుగోడులో ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఇచ్చారని ఆరోపించారు. అలాగే.. సచివాలయం ఆయన కోసమే కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ప్రతిపక్షాలకు అందులో అనుమతి లేదట అంటూ విమర్శలు గుప్పించారు. రూ.400 కోట్లుగా ఉన్నా సచివాలయం వ్యయం రూ.1600 కోట్లకి పెరిగిందన్నారు. అయితే 1200 కోట్లు ఎక్కడ పెట్టారంటూ ప్రశ్నించారు. 6 నెలల్లో పలు కీలక జరుగనున్నాయి. ప్రజలే సీఎం కేసీఆర్ కు బుద్ది చెప్పుతారని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు తోడు దొంగలే అన్నారు. .