గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ పై  విధించిన  సస్పెన్షన్ ను ఎత్తివేయాలని  బీజేపీ నాయకత్వాన్ని  కోరారు  విజయశాంతి.

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ పై  సస్పెన్షన్ ఎత్తివేయాలని సినీ నటి, బీజేపీ నేత  విజయశాంతి  కోరారు.  రాజాసింగ్ పై  సస్పెన్షన్ అంశంలో బీజేపీ నాయకత్వం నిర్ణయం ఆలస్యమౌతుందని విజయశాంతి అభిప్రాయపడ్డారు.రాజాసింగ్ పై  సస్పెన్షన్ ను ఎత్తివేయాలని  ఆమె  కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విజయశాంతి  కోరారు.

Scroll to load tweet…


2022 ఆగస్టు మాసంలో  మహ్మద్ ప్రవక్తపై  వివాదాస్పద వ్యాఖ్యలను  సోషల్ మీడియాలో పోస్టు చేశారని రాజాసింగ్ పై  పోలీసులు  కేసు నమోదు  చేశారు. ఈ విషయమై  బీజేపీ నాయకత్వం  రాజాసింగ్ పై  సస్పెన్షన్ వేటేసింది.  రాజాసింగ్ పై  సస్పెన్షన్ ను ఎత్తివేయాలని పార్టీలో  నేతలు  కోరుతున్నారు.  రాజాసింగ్ పై  సస్పెన్షన్ ను ఎత్తివేయాలని రాష్ట్రానికి చెందిన  నేతలు  పార్టీ జాతీయ నాయకత్వాన్ని  కోరారు.