ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పై తాను పోరాటం చేస్తానని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పైనా, కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీపైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 

ఢిల్లీలో కాంగ్రెస్ వార్ రూమ్ లో ఏఐసీసీ పబ్లిసిటీ సమావేశంలో పాల్గొన్న ఆమె లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆమెతోపాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు సమావేశానికి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అన్నారు. మోదీ వర్సెస్ రాహుల్ గాంధీగా ఎన్నికల ప్రచారం చేస్తామన్నారు. 

కాంగ్రెస్ వార్ రూమ్ లో ఎన్నికల ప్రచారంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై చర్చించారని ఎన్నికల ప్రచారం ఎప్పుటి నుంచి ప్రారంభించాలో అన్నది స్పష్టం చెయ్యలేదని విజయశాంతి తెలిపారు.