హైదరాబాద్:  టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి విరుచుకుపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ ఆరాచక పాలనకు శ్రీకారం చుట్టారన్నారు. అరాచకంగా తమ ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారని దుయ్యబట్టారు. 

రాష్ట్రంలో పరిస్థితి యథా రాజా తథా ప్రజ అన్నట్లుందని ఆమె వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నవారిని అడ్డుకున్న పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని రాములమ్మ ఆరోపించారు. 

టీఆర్‌ఎస్‌ హయాంలో ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందోనని ప్రజలు వణికిపోతున్నారని తెలిపారు. తెలంగాణలో ఇలాంటి అరాచకాలను ఎవరూ సహించరని విజయశాంతి హెచ్చరించారు.