హైదరాబాద్: విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన అధికారిక నివాసంలో వాహనపూజ, ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. 

దసరా పండుగ నాడు మంగళవారం ఉదయం ప్రగతి భవన్ నివాసంలోని నల్ల పోచమ్మ దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. 

వాహన పూజ చేశారు. నివాసంలో ఆయుధ పూజ  అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు  ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పూజా కార్యక్రమంలో సతీమణి శోభాచంద్రశేఖర్ రావు, కుమారుడు కె.తారక రామారావు, కోడలు శైలిమ,మనుమడు హిమాన్షు, కూతురు కవిత,  అల్లుడు అనిల్ కుమార్ మనుమళ్లు మనుమరాండ్లు ఇతర కుటుంబ సభ్యులు కార్యాలయ అధికారులు, సిబ్బంది తదిరలు పాల్గొన్నారు.