వేములవాడలో అక్రమ వడ్డీ వ్యాపారులపై కొరడా... పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అక్రమ వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. ఈ మధ్యే ఒక యాప్ లో అధిక వడ్డీకి అప్పు తీసుకున్న సిద్దిపేట లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువతీ ఆ అప్పు చెల్లించలేక ఆత్మహత్య చేసుకోవటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అక్రమ వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. ఈ మధ్యే ఒక యాప్ లో అధిక వడ్డీకి అప్పు తీసుకున్న సిద్దిపేట లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువతీ ఆ అప్పు చెల్లించలేక ఆత్మహత్య చేసుకోవటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
దాంతో ఒకానొక దశలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుండి తెలంగాణ పోలీసులు అక్రమ వడ్డీ వ్యాపారులపై నిత్యం నిఘా వేసి వారి పట్ల కఠినంగా కొరడా జుళిపిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మధ్యతరగతి ప్రజలను,పేదలకు డబ్బులు ఆశ చూపుతూ అక్రమ వడ్డీ వసూలు చేస్తున్నటువంటి అక్రమ ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసులు కొరడా జులిపించారు.
గతంలో వేములవాడ పట్టణంలో అధిక వడ్డీలు వసూలు చేస్తూ పేదలను, సామాన్యుల రక్తం పీలుస్తున్నారని ఎన్నో ఫిర్యాదులు అందాయి. కానీ పోలీసులు పట్టించుకోలేదు. ఆకస్మికంగా పోలీసులు రంగంలో దిగటంతో అక్రమ ఫైనాన్స్ వ్యాపారులకు గుండెల్లో దడ మొదలైయింది.
వేములవాడ పట్టణంలో చిరు వ్యాపారులకు ఐదు రూపాయలు, పది రూపాయల చొప్పున వడ్డీ ఇస్తూ వారి నుండి అక్రమ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా పట్టణంలో కొందరు అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న కొందరి వ్యక్తుల ఇళ్లపై దాడి చేసి కొన్ని కీలక పత్రాలతో కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో ఒక అడ్వొకేట్ విద్యాసాగర్ రావు అనే వ్యక్తి కూడా ఉన్నట్లు అతనితో పాటు ఇంకా కొందరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసులు అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.