హైదరాబాద్ లోని అఫ్జల్ గంజ్ లో జరిగిన వాహన తనిఖీల్లో ఓ షాకింగ్ విషయం బయటపడింది. తనిఖీల్లో భాగంగా ఓ యాక్టివా నెంబర్ను చెక్ చేసిన ట్రాఫిక్ పోలీసులు షాక్ కు గురయ్యారు.

 TS12EG8524 అనే నెంబర్ గల యాక్టివా మీద 69 పెండింగ్ ఛాలన్స్ ఉన్నాయి. రూ. 22170 / - లు పెనాల్టీ కట్టాల్సి ఉంది. అయితే ఈ పెండింగ్ ఛాలన్స్ అన్నీ ఎన్నో యేళ్లవి అనుకుంటే పొరపాటే.. 16.01.2020 నుండి 21.01.2021 మధ్య కాలంలో నమోదైనవి మాత్రమే. 

ఈ యాక్టివా ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వెహికిల్ రిషబ్ గుప్తా ఆర్ / ఓ మచిలి కామన్, పంజేషా, హైదరాబాద్ పేరు మీద ఉంది. వాహనదారుడు రూ. 22170 / - చెల్లించి చలాన్లు క్లియర్ చేశాడు.