Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్... వచ్చిన 48 గంటల్లోపే టీకా...

దేశంలో ఇప్పటికే రెండు వాక్సిన్లకు అనుమతి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమయినా వాక్సిన్ పంపిణీ మొదలయ్యే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రాలన్ని వాక్సిన్ పంపిణీకి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే వాక్సిన్ రాగానే ఎలా పంపిణీ చెయ్యాలి.. ఏమైనా సమస్యలు వస్తే పరిష్కారం ఎలా, తొలిదశలో తెలంగాణకు ఎన్ని వాక్సిన్ డోసుల రానున్నాయి ? అనే దాని మీద అధికారులు కసరత్తులు చేస్తున్నారు.  

vaccine run meetings : below 48 hours vaccine going to be given in Telangana - bsb
Author
Hyderabad, First Published Jan 5, 2021, 2:22 PM IST

దేశంలో ఇప్పటికే రెండు వాక్సిన్లకు అనుమతి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమయినా వాక్సిన్ పంపిణీ మొదలయ్యే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రాలన్ని వాక్సిన్ పంపిణీకి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే వాక్సిన్ రాగానే ఎలా పంపిణీ చెయ్యాలి.. ఏమైనా సమస్యలు వస్తే పరిష్కారం ఎలా, తొలిదశలో తెలంగాణకు ఎన్ని వాక్సిన్ డోసుల రానున్నాయి ? అనే దాని మీద అధికారులు కసరత్తులు చేస్తున్నారు.  

తెలంగాణకు వాక్సిన్ వచ్చిన వెంటనే అందించడానికి రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు వెంగళరావునగర్ లోని కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమావేశమైన వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు వాక్సిన్ పంపిణీపై కీలకంగా చర్చించారు.  అన్నీ జిల్లాల డి ఎమ్ హెచ్ ఓ లతో సమావేశం నిర్వహించింది.

తెలంగాణ లో  కోల్డ్ స్టోరేజ్ లను సిద్ధం చేశారు. రాష్ట్రానికి వాక్సిన్ ఎప్పుడు వచ్చినా  పంపిణీ చేసేందుకు ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి దశలో 80 లక్షల మందికి టీకాలు ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 

ముందుగా కరోనా వారియర్స్ కి, పారిశుధ్య కార్మికులకు, పోలీసులకు ఆ తరువాత 50సంవత్సరాలు దాటినా వారికి, చివరిగా 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 
తెలంగాణకు ముందుగా  5లక్షల డోసులు, ఆ తరువాత 10లక్షలు, అనంతరం కోటి డోసులు రాష్ట్రానికి రానున్నాయి. వాక్సిన్ వచ్చిన 48 గంటల లోపే అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios