చాలా మంది హాస్పిటల్ కి నన్ను కలవడానికి వచ్చారు అందరకి కృతజ్ఞతలు అన్నారు. బడుగు, బలహీన వర్గాల వాళ్లకి నాసేవలు అవసరమని మా సోనియాగాంధీ చెప్పారన్నారు. రాజకీయాల్లోకి సేవ చేయాలని వచ్చాను. అంతే తప్ప డబ్బులు సంపాదించడానికి రాలేదన్నారు.

హైదరాబాద్ : నా ఆరోగ్యం విషయంలో మా అధినేత్రి సోనియాగాంధీ పాటు ఇతర నాయకులూ అందరు నన్ను పరామర్శించారు అంటూ మాజీ ఎంపి.. వి.హనుమంత రావు సంతోషం వ్యక్తం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చాలా మంది హాస్పిటల్ కి నన్ను కలవడానికి వచ్చారు అందరకి కృతజ్ఞతలు అన్నారు. బడుగు, బలహీన వర్గాల వాళ్లకి నాసేవలు అవసరమని మా సోనియాగాంధీ చెప్పారన్నారు. రాజకీయాల్లోకి సేవ చేయాలని వచ్చాను. అంతే తప్ప డబ్బులు సంపాదించడానికి రాలేదన్నారు.

సోనియా గాంధీ తనతో మాట్లాడటం వల్ల నాకు మరింత దైర్యం పెరిగిందని చెప్పుకొచ్చారు. తన మిగతా జీవితం అంత బడుగు బలహిన వర్గాలకి సేవ చేస్తానన్నారు. 

ఎక్కడ పేదవారికి ఆపద ఉన్నా ఆదుకునే పవన్ కళ్యాణ్ నా అరోగ్య విషయంలో నాకు లెటర్ రాసారని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఉంటానని అన్నారు.

మా నాయకురాలిని కలిసిన తరువాత కొత్త కమిటీ, పాత కమిటి గురుంచి మాట్లాడతానని, అప్పటివరకు ఎం మాట్లాడానని చెప్పుకొచ్చారు.