కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బస్సు చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి... డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కె.కె. మహేందర్ రెడ్డి తరపున ప్రచారంలో పాల్గొనేందుకు వీహెచ్ బుధవారం సిరిసిల్ల వెళ్లారు. ప్రచారం ముగించుకుని హైదరాబాద్ తిరిగి వస్తుండగా.. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరేళ్ల గ్రామం వద్ద ఆయన ప్రయాణిస్తున్న ప్రచార రథం చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి.

బస్సు అమితమైన వేగంతో ఉండటంతో చక్రాలు ఊడిపోయినప్పటికీ 100 మీటర్లు వెళ్లింది.. అయితే డ్రైవర్ సమయస్పూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.. అయితే ఆ సమయంలో వీహెచ్ విజయరథంలో కాకుండా వెనుకకార్లో ప్రయాణిస్తున్నారు.

అయితే నేరేళ్లలో బాధితుల కోసం నేను టీఆర్ఎస్‌పై విమర్శలు చేసినందుకే... ఆ పార్టీ నేతలు బస్సు టైర్‌కి ఫిట్ చేసిన ఉన్న నట్‌లు, బోల్టులు ఊడదీశారని వీహెచ్ ఆరోపించారు. దీనిపై స్థానిక పోలీసులకు హనుమంతరావు ఫిర్యాదు చేశారు.