హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లు భట్టి విక్రమార్క దీక్షను అడ్డుపెట్టుకొని తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని హనుమంతరావు తీవ్రమైన విమర్శలు చేశారు.

మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత వి.హనుమంతరావు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో 'ఆత్మ'కు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా కేవీపీపై విమర్శలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలను రాహుల్ గాంధీకి వివరించేందుకు తాను ప్రయత్నిస్తున్నా కూడ అపాయింట్ మెంట్ లభ్యం కాలేదని  హనుమంతరావు వ్యాఖ్యానించారు. 

ఐదు మాసాలుగా రాహుల్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా  ఆయన చెప్పారు. అయితే తనకు రాహుల్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే మీడియాకు అన్ని విషయాలను వివరించనున్నట్టుగా  వి. హనుమంతరావు తేల్చిచెప్పారు.