పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో హత్యకు గురైన న్యాయవాద దంపతుల కుటుంబ సభ్యులను పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరామర్శించారు.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో హత్యకు గురైన న్యాయవాద దంపతుల కుటుంబ సభ్యులను పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరామర్శించారు.
"
అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో రాక్షస పాలన జరుగుతుందన్నారు. నడిరోడ్డుపై ఇద్దరు హైకోర్టు న్యాయవాదుల ను నరికి చంపితే ఇప్పటివరకు ముఖ్యమంత్రి గానీ వారి మంత్రివర్గం కానీ స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు.
ఇద్దరు న్యాయవాదులు మంథని ప్రాంతంలో జరుగుతున్న మాఫియాల పై కోర్టులో ఫీల్ వేస్తే అధికార పార్టీకి చెందినవారు హత్య చేశారని ఆరోపించారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదని కానీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎదురిస్తే హత్యలు చేయడం ఏంటి అని ప్రశ్నించారు.
కేసీఆర్ కి ఇంత అహంకరం, అమానుష ధోరణి ఎందుకు అని మండిపడ్డారు.