ధరణితో భూ సమస్యలు ఎక్కువయ్యాయి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ధరణి పోర్టల్   కారణంగా  భూ సమస్యలు  ఇంకా ఎక్కువయ్యాయని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు. 

Union Minister Kishan Reddy Serious Comments on Dharani  Portal lns

హైదరాబాద్: ధరణి పోర్టల్ కారణంగా  కొత్తగా భూ సమస్యలు  వచ్చి రైతులు  ఇబ్బంది పడుతున్నారని  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి చెప్పారుజశుక్రవారంనాడు సాయంత్రం హైద్రాబద్ లోని  బీజేపీ కార్యాలయంలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే  దాదాపుగా  10 లక్షల ధరఖాస్తులు పెండింగ్ లో  ఉన్నాయన్నారు. పాసుపుస్తకాల్లో  తప్పుల సవరణకు  అవకాశం లేకుండా  పోయిందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు. 

ధరణి పోర్టల్ కారణంగా  రైతులు  వేధింపులకు గురౌతున్నారన్నారు.  లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చారని  కిషన్ రెడ్డి విమర్శించారు.భూములపై హక్కులను  కోల్పోయిన రైతులు  కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని  కిషన్ రెడ్డి  గుర్తు  చేశారు. అయితే  అదే రైతులకు  న్యాయం చేస్తామని  బీఆర్ఎస్ నేతలు దళారులుగా మారారని కిషన్ రెడ్డి  ఆరోపించారు.  ఒక్పప్పుడు  గ్రామస్థాయిలో  పరిష్కారమయ్యే  సమస్యలు నేడు  ప్రగతి భవన్ కు వెళ్తున్నాయన్నారు.  ధరణి పేరుతో   రెవిన్యూ వ్యవస్థను  నిర్వీర్యం చేశారని  కిషన్ రెడ్డి  చెప్పారు. 

ధరణి కారణంగా  పేదల భూములను  మధ్య దళారీలు,  అధికార పార్టీ నేతలు కొట్టేస్తున్నారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఆరోపించారు.   ధరణి పోర్టల్  బ్రోకర్లను  పెంచి పోషించేలా ఉందని  కోర్టులు  వ్యాఖ్యానించాయని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  గుర్తు  చేశారు.

ధరణిలో  తప్పిదాలకు ఆస్కారం  లేదని  చెప్పిన  మాటలు వాస్తవం కాదన్నారు కేంద్ర మంత్రి , ధరణి పోర్టల్ లాక్, ఆన్ లాక్  ప్రగతి భవన్ లో ఉందా, ఏ అధికారి చేతిలో ఉందని  కిషన్ రెడ్డి  ప్రశ్నించారు.  

కొన్నేళ్ల క్రితం  అమ్ముకున్న  భూములు  ఇప్పుడు  భూస్వాముల  పేర్లతో  ధరణిలోకి ఎలా వచ్చాయని  ఆయన అడిగారు. ధరణి పోర్టల్ లో  సమస్యలపై  రైతులు  పెట్టుకున్న  ధరఖాస్తులపై  అధికారులు ఎందుకు  పరిష్కరించడం లేదని  కేంద్ర మంత్రి  ప్రశ్నించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios