తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హోరు మొదలైంది. ఒకవైపు టీఆర్ఎస్, మరో వైపు మహాకూటమి.. పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. గత  అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 సీట్లకు గాను 63 సీట్లు గెలుచుకొని అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ మరోసారి అధికారం దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలే చేస్తుంది.ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణలోని 49సీట్లపై తన దృష్ణి కేంద్రీకరించారు.

ఆ 49 సీట్లే ఎందుకు అంత కీలకమంటే.. ఇప్పటి వరకు  ఏ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఆ సీట్లలో గెలవకపోవడం గమనార్హం. 49సీట్లు ఎప్పటి నుంచో టీఆర్ఎస్ కి కొరకరాని కొయ్యగా మారాయి. అందుకే వాటిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ సీట్లలో గత ఎన్నికల్లో గెలిచిన కొందరు అభ్యర్థులను ఆకర్ష్ పేరిట తమ పార్టీలో చేర్చేసుకున్నారు. ఆమేరకు కొంత  సక్సెస్ సాధించినప్పటికీ..మరింత ఫోకస్ అవసరమని కేసీఆర్ భావిస్తున్నారు.

ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిన ప్రాంతాలు ఉన్నాయి. కానీ.. దక్షిణ తెలంగాణలో మాత్రం కొన్ని స్థానాలు అసలు డిపాజిట్లు కూడా దక్కలేదు. వాటిలో హైదరాబాద్ లో మజ్లీస్ ప్రాబల్యం ఉన్న 7 స్థానాలు మినహాయిస్తే 42 స్థానాలను టీఆర్ఎస్ టార్గెట్ చేసింది. ఆ స్థానాలు ఏంటంటే...

ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, 
కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, 
మెదక్ జిల్లాలోని జహీరాబాద్,
రంగారెడ్డిలో కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేర్ లింగంపల్లి, పరిగి
హైదరాబాద్ లో మలక్ పేట, అంబర్ పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్ ఫురా, బహదూర్ పురా, కంటోన్మెంట్
మహబూబ్ నగర్ లో కొడంగల్, నారాయణపేట, మక్తల్, వనపర్తి, గద్వాల, అలంపూర్, కల్వకుర్తి
నల్గొండలో దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, నల్గొండ
వరంగల్ లో పాలకుర్తి, డోర్నకల్
ఖమ్మంలో పినపాక, ఇల్లెందు, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం

మరి ఈ స్థానాల్లో ఈసారి టీఆర్ఎస్ బోణి కొడుతుందో లేదో  చూడాలి. మరోవైపు మహాకూటమి నేతలు కూడా ఈ స్థానాలను కాపాడుకుంటూ... టీఆర్ఎస్ కి బలంగా ఉన్న ప్రాంతాలపై గురిపెడుతున్నాయి. చివరకు ఎవరివది పై చేయి గా మారుతుందో తెలియాలంటే.. కొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే.