Asianet News TeluguAsianet News Telugu

చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. అనంతగిరి హిల్స్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం..

చేవెళ్ల‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఆదివారం ఉదయం ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

Two students dead after a car crashes into tree in Chevella ksm
Author
First Published Sep 10, 2023, 4:09 PM IST | Last Updated Sep 10, 2023, 4:09 PM IST

చేవెళ్ల‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఆదివారం ఉదయం ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన విద్యార్థులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరు వ్యక్తులను ప్రదీప్, సోనిగా, గాయపడిన వారిని ఆర్య, క్రాంతిలుగా గుర్తించారు.  

తర్వాత గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అయితే బాధితులు నిన్న హైదరాబాద్ నుంచి అనంతగిరి హిల్స్‌కు వెళ్లారని.. ఈ రోజు ఉదయం తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అయితే బాధితులు ఇంజనీరింగ్ విద్యార్థులుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఈ ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios