సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ వద్ద బుధవారం నాడు ఓ కారులో  మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు.మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.

అవుటర్ రింగ్ రోడ్డులోని అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ వద్దకు కారు రాగానే మంటలు వ్యాపించాయి. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.

అయితే  ఈ కారులో  మంటలు వ్యాపించడానికి కారణాలు ఏమిటనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.