తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతోంది.  ఈ చలితీవ్రత ను తట్టుకోలేక ఇద్దరు వృద్ధులు కన్నుమూశారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో చలి తీవ్రతకు ఇద్దరు వృద్ధులు మృత్యువాత పడ్డారు. 

భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం అమెర్థా ఎస్ సి కాలనీకి చెందిన యాస రాజేంద్రం(65) అనారోగ్యంతో బాధపడుతుండగా చలి తీవ్రత ఎక్కువ కావటంతో మృతి చెందాడు. అలాగే ఖమ్మం జిల్లా వైరా మండలం అష్ణగుర్తి గ్రామానికి చెందిన మస్తానమ్మ (85)  చలి తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు విడిచింది.