Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ సభ: 3 గంటల పాటు మెట్రో రైళ్ల నిలిపివేత

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స లో బీజేపీ బహిరంగ సభను పురస్కరించుకొని  మూడు గంటల పాటు మెట్రో రైల్ సేవలు నిలిచిపోనున్నాయి. ఇవాళ సాయంత్రం ఐదున్నర గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నాయి.
 

Two metro stations to be temporarily closed for BJP Parade Ground meet in Hyderabad
Author
Hyderabad, First Published Jul 3, 2022, 2:48 PM IST

హైదరాబాద్: BJP  జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపును పురస్కరించుకొని  Secunderabad Parade Ground  లో  బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.ఈ  సభను పురస్కరించుకొని ఆదివారం నాడు సాయంత్రం ఐదున్నర నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు Metro Rail సర్వీసులను నిలిపివేయనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ సాయంత్రం నాలుగు గంటలకు ముగియనున్నాయి. 

రాజకీయ తీర్మానంపై ప్రధాని Narendra Modi ప్రసంగంతో జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగియనున్నాయి. సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో  సభను పురస్కరించుకొని  సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు మెట్రో రైల్ సర్వీసులను నిలిపివేయనున్నట్టుగా హైద్రాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. 

 

Paradise, పరేడ్గ్ గ్రౌండ్స్, JBS స్టేషన్లను మూడు గంటల పాటు నిలిపివేయనున్నారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేయనున్నారు.మియా;పూర్-ఎల్ బీ నగర్ మార్గంలో రైళ్లు యధావిధిగా నడుస్తాయని హైద్రాబాద్ మెట్రో రైలు ప్రకటించింది.ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించాలని  హైద్రాబాద్ మెట్రో రైల్ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.

బీజేపీ సభను పురస్కరించుకొని  హైద్రాబాద్ లో పలు చోట్ల Trafficఆంక్షలను విధించారు. నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు ప్రకటించారు.HICC నుండి ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు  హులికాప్టర్ లో వెళ్లనున్నారు. అయితే వాతావరణం అనుకూలించకపోతే ప్రధాని రోడ్డు మార్గంలోనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో ప్రధాని పరేడ్ గ్రౌండ్స్ కి వెళ్తే హెచ్ఐసీసీ, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు కొనసాగించనున్నారు. 

also read:ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి: రాజకీయ తీర్మాణంపై ప్రసంగంలో అమిత్ షా

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇవాళ సభ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ రాజ్ భవన్ లోనే బస చేయనున్నారు. ఇవాళ రాత్రి నుండి రేపు ఉదయం వరకు రాజ్ భవన్ రోడ్డును మూసివేయనునన్నారు. రాజ్ భవన్ లో ప్రధాని నరేంద్ర మోడీ బస చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios