హైదరాబాద్ చిక్కడపల్లిలో విషాదం చోటు చేసుకుంది.. హైటెన్షన్ వైర్లు తగిలి ఇద్దరు దుర్మరణం పాలవ్వగా... ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాగ్‌లింగంపల్లిలోని ఓ బిల్డింగ్‌పైన పెంట్ హౌస్ నిర్మాణం చేయిస్తున్నారు ఆ ఇంటి యజమాని మన్ సుఖ్‌లాల్
హైదరాబాద్ చిక్కడపల్లిలో విషాదం చోటు చేసుకుంది.. హైటెన్షన్ వైర్లు తగిలి ఇద్దరు దుర్మరణం పాలవ్వగా... ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాగ్‌లింగంపల్లిలోని ఓ బిల్డింగ్‌పైన పెంట్ హౌస్ నిర్మాణం చేయిస్తున్నారు ఆ ఇంటి యజమాని మన్ సుఖ్‌లాల్.. ఈ క్రమంలో పెంట్‌హోస్ నిర్మాణానికి కావలసిన ఇనుప కడ్డీలను కింద నుంచి పైకి అందిస్తుండగా.. ఇనుప చువ్వలు హైటెన్షన్ వైర్లను తాకాయి..
దీంతో వాటిలో విద్యుత్ ప్రవహించి కిందవున్న మన్‌సుఖ్‌లాల్, వర్కర్ వహిద్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. వారిని కాపాడటానికి ప్రయత్నించిన సుఖ్‌లాల్ కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
