తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో జంపింగ్‌లు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. టిక్కెట్లు దక్కని వారు, హైకమాండ్ మీద అలకపూనిన వారు వరుసగా పార్టీలు మారుతున్నారు.  ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఇవాళ టీఆర్ఎస్‌లో చేరారు.

వికారాబాద్ జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి కమతం రాంరెడ్డి పరిగిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్ ఆ పార్టీకి రాజీనామా చేసి కారెక్కారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో మల్లేశ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.