లంగర్‌హౌస్‌ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు మృతి చెందారు. పిల్లర్‌ నంబర్‌ 102 వద్ద ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్‌ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను నానక్‌రామ్‌గూడ ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేసే దీపికా నిఖిల్‌, షాబాజ్ హైమద్ ఖాన్ గా గుర్తించారు.  వీరి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.