Asianet News TeluguAsianet News Telugu

కూకట్‌పల్లి ఏటీఎం సెంటర్‌లో దోపీడీకి పక్కా ప్లాన్,ఇద్దరి అరెస్ట్: సజ్జనార్

:పక్కా ప్లాన్‌తోనే హైద్రాబాద్ కూకట్‌పల్లి ఏటీఎం సెంటర్లో  దోపిడీకి పక్కా ప్లాన్‌ చేశారని  సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు.ఈ కేసులో ఇద్దరు బీహార్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశామన్నారు. 
 

two arrested for kukatpally ATM robbery case :cyberabad cp sajjanar lns
Author
Hyde Park, First Published May 12, 2021, 3:51 PM IST

హైదరాబాద్:పక్కా ప్లాన్‌తోనే హైద్రాబాద్ కూకట్‌పల్లి ఏటీఎం సెంటర్లో  దోపిడీకి పక్కా ప్లాన్‌ చేశారని  సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు.ఈ కేసులో ఇద్దరు బీహార్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశామన్నారు. బుధవారం నాడు  కూకట్‌పల్లి ఏటీఎం లో సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపి  దోపీడీ గురించి సీపీ మీడియాకు వివరించారు.  ఈ ఇద్దరికి మరో నాలుగు కేసులతో కూడ సంబంధం ఉందని ఆయన తెలిపారు.  తొలుత తుపాకీతో బెదిరించి దోపీడీకి పాల్పడ్డాలని భావించారు. కానీ సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో అతనిపై కాల్పులు జరిపినట్టుగా సీపీ  చెప్పారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

 బీహార్   చెందిన  అబిజిత్ కుమార్  ముఖేష్ లు  ఏటీఎంలో డబ్బులు నింపే వాహనాలను లక్ష్యంగా చేసుకొని దోపీడీ చేయాలని ప్లాన్ చేశారన్నారు. ఇందుకోసం  బీహార్ నుండి  తుపాకీని సమకూర్చుకొన్నారన్నారు. అయితే ఈ తుపాకీ పనిచేస్తోందో లేదో తెలుసుకొనేందుకు గాను మైసిగండి వద్ద పరీక్షించినట్టుగా చెప్పారు.   ఆ తర్వాత  ఏప్రిల్ 29వ తేదీన  కూకట్‌పల్లి ఏటీఎంలో డబ్బులు పెట్టే క్యాష్ వెహికిల్ ఫాలో అయ్యారని ఆయన చెప్పారు.  ఈ విషయాన్ని డబ్బులు  ఏటీఎంలో జమ చేసే సిబ్బంది గుర్తించలేదన్నారు. 

also read:కూకట్‌పల్లి కాల్పుల కేసు: నిందితుల అరెస్ట్... సరిహద్దులు దాటకుండానే పట్టేసిన పోలీసులు

కూకట్‌పల్లి ఏటీఎం సెంటర్ లో డబ్బులు నింపే సమయంలో  సెక్యూరిటీ  నిందితుడి నుండి తుపాకీని లాక్కొనే సమయంలో అబిజిత్ కాల్పులు జరిపినట్టుగా ఎస్పీ చెప్పారు. సెక్యూరిటీ గార్డుతో పాటు  ఏటీఎంలో డబ్బులు నింపే ఆపరేటర్లు శ్రీనివాస్, నవీన్ లు నిందితులను పట్టుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారని  సీపీ వివరించారు. నవీన్, శ్రీనివాస్ లకు మరికొందరు సహాయంగా వస్తే  నిందితులు అక్కడే  పట్టుబడిపోయేవాళ్లని ఆయన చెప్పారు.
నిందితుల నుండి రూ. 6.31 లక్షల నగదు, తుపాకీ, బైక్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నామని సీపీ తెలిపారు.  50 ఏళ్లు దాటిన వారిని సెక్యూరిటీ గార్డుగా నియమించుకోవద్దని  సీపీ బ్యాంకు మేనేజర్లకు సూచిస్తున్నారు. ఈ విషయమై తాము త్వరలోనే బ్యాంకర్లతో సమావేశంకానున్నట్టుగా చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios