Asianet News TeluguAsianet News Telugu

TSRTC ప్రయాణీకులకు గుడ్ న్యూస్ .. ఆ రూట్‌లలో 10 శాతం రాయితీ.. వివరాలు ఇవిగో..

TSRTC| సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఓ వార్త చెప్పింది. బెంగుళూరు, విజయవాడ రూట్‌లలో టికెట్ పై 10 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించింది. అలాగే.. ఈ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం ముందస్తు రిజర్వేషన్ ను తీసుకొచ్చింది.  

TSRTC has announced 10 percent discount on vijayawada and bangalore route KRJ/SIR
Author
First Published Jul 1, 2023, 10:46 PM IST

TSRTC| తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC).. ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపరుచుకుంటూ.. ప్రయాణీకులకు నాణ్యమైన సేవలందించాలని భావిస్తుంటుంది.  ఈ తరుణంలో ఓ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రైవేటు ట్రావెల్స్‌కు ధీటుగా ఏసీ స్లీపర్‌ సర్వీసుల (AC Sleeper Bus)ను ప్రారంభించిన విషయం తెలిసిందే.. తాజాగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను తనవైపు ఆకర్షించుకోవాలని ప్రయత్నిస్తుంది.

ఈ క్రమంలో బెంగుళూరు, విజయవాడ రూట్‌లలో (ఆర్టీసీ) ప్రయాణించే వారికి టికెట్ పై 10 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించింది. ఆ రెండు మార్గాల్లో రాకపోకలు కొనసాగించే..  ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే.. వారి ప్రయాణంపై ఈ 10 శాతం డిస్కౌంట్ ను సంస్థ అందించనున్నది.

ఆదివారం(జులై 2) నుంచి ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని అన్నీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ అమల్లోకి వస్తుంది. ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుంది. ''విజయవాడ, బెంగళూరు మార్గాల్లో ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్ ను తీసుకవచ్చింది టీఎస్ఆర్టీసీ. ఈ ఆఫర్ పొందాలంటే.. రానూపోను ఒకే సారి బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ వస్తుంది.  

ఈ రాయితీతో  విజయవాడ మార్గంలో రూ.50 వరకు, బెంగళూరు మార్గంలో రూ.100 వరకు (ఒక్కో ప్రయాణికుడికి) ఆదా అవుతుంది.  ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుందనీ, ఈ  రాయితీ సద్వినియోగం చేసుకోవాలని  టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ కోరారు. మరిన్ని వివరాల కోసం తమ  అధికారిక వెబ్‌సైట్‌ www.tsrtconline.com ను సంప్రదించాలని వారు సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios