మహారాష్ట్రలో తెలంగాణ ఆర్టీసీ బస్సుకి తృుటిలో పెను ప్రమాదం తప్పింది. పండరీపూర్ నుంచి ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరిన బస్సు.. షోలాపూర్-పుణే జాతీయ రహదారిపై ఆగివున్న లారీనీ ఢీకొట్టింది.

దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి... బస్సు, లారీ పూర్తిగా దగ్థమయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసి, క్షతగాత్రులను షోలాపూర్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.