హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ కార్యచరణను ప్రకటించింది టీఎస్ ఆర్టీసీ జేఏసీ. సమ్మె యధాతథంగా కొనసాగుతుందని టీఎస్ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేమైన టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు భవిష్యత్ కార్యచరణఫై చర్చించారు. ఈ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని టీఎస్ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. 

ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ తాము హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో కొంతమంది ప్రజాప్రతినిధులను కలవలేకపోయామని తెలిపారు. 

తమ పిటీషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు విచారణను ఈనెల 15కు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించినట్లు తెలిపారు. ఈనెల 11న అంటే శుక్రవారం రాష్ట్రంలోని అన్ని బస్ డిపోల వద్ద ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఇతర ప్రజాప్రతినిధులకు తమ సమస్యలపై వినతిపత్రాలను ఇవ్వనున్నట్లు అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. 

ఈనెల 12న దివంగత నేతల విగ్రహాలకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు. అనంతరం అక్కడే రెండు గంటలపాటు మౌన దీక్షకు దిగనున్నట్లు తెలిపారు. మెుక్కవోని దీక్షలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని కోరారు. 

ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు ధన్యవాదాలు తెలిపారు. సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ సూపర్ వైజర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 12న సూపర్ వైజర్లతో భేటీ నిర్వహించనున్నట్లు కోరారు.