గ్రూప్ 2 ఇంటర్వ్యూల నిర్వహణకు టీఎస్ పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసింది.  రెండు రోజుల్లో 1:2 నిష్పత్తి చొప్పున అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత వారి జాబితాను వెబ్ సైట్లలో పొందుపరుస్తారు. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు  చేస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు.

గ్రూప్‌-2 ఎంపికలో నెలకొన్న వివాదంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇంటర్వ్యూలకు మార్గం సుగమమైంది. మొత్తం 1,032 పోస్టులకు గానూ టీఎ్‌సపీఎస్సీ 2064మందిని ఎంపిక చేసింది. రెండు రోజుల్లో జాబితాను విడుదల చేస్తామని.. ఈ నెల మూడో వారం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశాలున్నాయని టీఎస్ పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.