తెలంగాణ టెట్-2022 పరీక్ష ప్రారంభం: ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ టెట్ 2022 పరీక్షలు ప్రారంభమయ్యాయి., ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కంద్రాలకు అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,683 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నాడు టెట్ పరీక్ష ప్రారంభమైంది. డీఎస్ రాసేందుకు టెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఇవాళ ఉదయం, మధ్యాహ్నం రెండు విభాగాల్లో టెట పరీక్షలు నిర్వహిస్తున్నారు. టెట్, ఆర్ఆర్‌బీ పరీక్షలు ఒకే రోజున ఉండడంతో TS TET-20222 పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన షెడ్యూల్ ప్రకారంగానే టెట్ పరీక్షను నిర్వహిస్తుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా అభ్యర్ధులను పరీక్షా కేంద్రలను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు.
టెట్ Exams నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,683 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. GHMC పరిధిలో సుమారు 336 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 83,465 మంది పరీక్షకు హాజరు కానున్నారు. అత్యధికంగా Hyderabad లో 212 పరీక్ష కేంద్రాలున్నాయి. రాజ ధానిలో మొత్తం 50,600 మంది పరీక్ష రాస్తున్నారు. ములుగులో అతి తక్కువగా 15 పరీక్ష కేంద్రాలున్నాయి. ఈ జిల్లాలో దాదాపు 2,200 మంది పరీక్ష రాస్తున్నారు.
ప్రతి పరీక్షా కేంద్రానికి 11 మంది ఇన్‌విజిలేటర్లు, మరో ముగ్గురు పర్యవేక్షణ అధికారుల చొప్పున విధులు నిర్వహించనున్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. వీటిని ఇంటర్నెట్ ద్వారా జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. ప్రశ్నపత్రం ఓపెన్ చేయడం మొదలు కొని, ప్యాక్ చేసే వరకూ వీడియో రికార్డింగ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
Paper– 1 అభ్యర్థులకు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, పేపర్– 2 అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్‌జీటీ అభ్యర్ధులు పేపర్1 పరీక్షఁ రాస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి 12 వరకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్లకు పేపర్ -2 పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది.
పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది, తాగునీరు, నిరంతర విద్యుత్ సౌకర్యాలు కల్పించారు. పరీక్ష సమయానికి కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి.
పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్ టికెట్‌పై ఫొటో, సంతకం సరిగా లేకపోయినా, అస్సలు లేకపోయినా అభ్యర్థులు తాజా ఫొటోను అతికించి, గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్ చేయించుకొని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో చాలా మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.
అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా హాలులోకి అనుమతించబోమని అధికారులు తెలిపారు. OMR షీట్లను చించడం, మతడపెట్టడం చేయవద్దని అధికారులు సూచించారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.