హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి వర్గం కూర్పుపై హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా మంత్రి వర్గ కూర్పు చేశారని ప్రశంసించారు. 

హైదారాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ కేబినెట్ లో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ మంత్రి వర్గం కూర్పు జరిగిందన్నారు. ఇకపోతే బీసీలకు, దళితులకు కేబినెట్ లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. 

ఏపీలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వైయస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 

ఇకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారత్సవానికి కుమారుడుతో సహా హాజరయ్యారు తలసాని. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మెుదటి నుంచి చెప్తూ వచ్చారు.