తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ఐసెట్-2019 ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని జరిగిన కార్యక్రమంలో ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, ఐసెట్ కన్వీనర్ ఆర్.సాయన్న విడుదల చేశారు.

ఫలితాల్లో 92.01 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారని పాపిరెడ్డి తెలిపారు. మల్కాజ్‌గిరికి చెందిన హనీష్ సత్య తొలి ర్యాంకు సాధించగా, నాచారంకు చెందిన సూర్య ఉజ్వల్  2, తిలక్ నగర్‌కు చెందిన ప్రద్యుమ్నా రెడ్డి 3వ ర్యాంక్ సాధించారు. కాగా గత నెల 23, 24 తేదీలలో జరిగిన ఐసెట్ పరీక్షకు దాదాపు 49 వేల మంది విద్యార్ధులు హాజరయ్యారు.