Asianet News TeluguAsianet News Telugu

కరోనా సెకండ్ వేవ్ : బార్లు, పబ్ ల మీద ఆంక్షలేవి.. సర్కార్ కు హైకోర్టు మొట్టికాయలు..

తెలంగాణలో కరోనా పరిస్థితులపై మంగళవారం హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు, చికిత్స. నియంత్రణలపై నివేదిక సమర్పించింది. 

ts high court hearing on covid cases in hyderabad - bsb
Author
Hyderabad, First Published Apr 6, 2021, 1:39 PM IST

తెలంగాణలో కరోనా పరిస్థితులపై మంగళవారం హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు, చికిత్స. నియంత్రణలపై నివేదిక సమర్పించింది. 

దీన్ని పరిశీలించిన హైకోర్టు బార్లు, పబ్లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు ఆర్ టి పి సి పరీక్షలు అతి తక్కువ చేస్తున్నారని, పూర్తిగా ర్యాపిడ్ టెస్టులమీదే దృష్టి పెట్టారని ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఆర్ టి పి సి పరీక్షలు 10% కూడా లేవని ధర్మాసనం పేర్కొంది. ఆర్ టి పి సి పరీక్షలు నెమ్మదిగా పెంచుతున్నామని ఏజీ వివరణ ఇవ్వగా,  రెండోదశ కరోనా వేగంగా విస్తరిస్తుంటే ఇంకా నెమ్మదిగా పెంచడం ఏంటని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఆర్ టి పి సి పరీక్షలు పెంచాలని స్పష్టంచేసింది. వివాహాలు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది మరణాల రేటు వెల్లడించాలని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలాంటి రద్దీ ప్రాంతాల్లో పరీక్షల వివరాలు తెలపాలని ఆదేశించింది.

రాష్ట్రంలో కరోనా చికిత్స కేంద్రాల వివరాలుపై విస్తృత ప్రచారం చేయాలని, అనాథ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది. కరోనా నిబంధనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని, నిబంధనలను పాటించని వారిపై నమోదైన కేసులు, జరిమానాల వివరాలు వెల్లడిస్తూ 48 గంటల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios