తెలంగాణలో ఇద్దరు శాసనసభ్యులకు ప్రభుత్వం భద్రతను పెంచింది. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డిలు వారి నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో తమకు భద్రతను పెంచాల్సందిగా ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. వీరి విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకున్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు ఇద్దరికి 4+4 గన్‌మెన్‌లను కేటాయించారు.