TS Eamcet: తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. eamcet అధికారిక వెబ్ సెట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు

TS Eamcet :  ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు ఎంసెట్ హాల్ టికెట్లను రిలీజ్ చేశారు. విద్యార్థులు eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేయడానికి.. అభ్యర్థి  తన రిజిస్ట్రేషన్ నంబర్, అర్హత గల పరీక్ష హాల్ టికెట్ నంబర్( ఇంటర్మీడియట్), పుట్టిన తేదీతో లాగిన్ అవ్వాలని తెలిపారు. 

తెలంగాణ ఎంసెట్ పరీక్షలను జేఎన్‌టీయూ హైదరాబాద్ నిర్వహిస్తుంది. షెడ్యూల్ ప్రకారం.. మే 10 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్, ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు, మే 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. 

కాగా ఈ ఏడాది ఎంసెట్‌ కు మొత్తం 3.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంక ఆన్‌ లైన్‌ దరఖాస్తు ప్రక్రియ లేట్ ఫీజుతో మే 2వ తేదీ వరకు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా ఎంసెట్‌ కోకన్వీనర్‌ ప్రొఫెసర్‌ విజయకుమార్‌రెడ్డి తెలిపారు.  

TS EAMCET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోండిలా.. 
 
==> తొలుత eamcet.tsche.ac.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

==> TS EAMCET 2023 హాల్ టిక్కెట్‌ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి. 

==> ఆ తరువాత EAMCET రిజిస్ట్రేషన్ నంబర్, అర్హత పరీక్ష హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.

==> TS EAMCET హాల్ టికెట్ 2023 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. 

==> TS EAMCET అడ్మిట్ కార్డ్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోండి , ఆ తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి.