తెలంగాణలో డిగ్రీలో ప్రవేశానికి నోటిఫికేషన్: ఈ నెల 20 నుండి దోస్త్ లో రిజిస్ట్రేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ఆడ్మిషన్ల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ ను ఉన్నత విద్యామండలి గురువారంనాడు విడుదల చేసింది., ఈ నెల 20 నుండి దోస్త్ వెబ్ ఆఫ్షన్స్ ఎంపిక చేసుకోవాలని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మూడు విడతలుగా దోస్త్ ఆడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించనున్నారు. జూన్ 16న తొలి విడత డిగ్రీ సీట్లను కేటాయించనున్నారు.జూన్ 16 నుండి జూన్ 26 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు నిర్వహించుకొనే వెసులుబాటు కల్పించింది ఉన్నత విద్యామండలి. జూన్ 16 నుండి జూన్ 27వ రకు రెండో విడత దోస్త్ వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నారు. జూన్ 30వ తేదీన రెండో విడత డిగ్రీ కాలేజీ సీట్లను కేటాయింనున్నారు.
ఈ ఏడాది జూలై 1 నుండి ఐదో తేదీ వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లను నిర్వహించుకొనే అవకాశం కల్పించింది ఉన్నత విద్యామండలి, జూలై 10న డిగ్రీ సీట్లను కేటాయించనున్నారు. ఈ ఏడాది జూలై 17 నుండి డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభించనున్నట్టుగా తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.డిగ్రీల్లో ప్రవేశం కోసం గత కొంతకాలంగా ఆన్ లైన్ లో ఆడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రారంభించింది. దోస్త్ ను ప్రారంభించింది. దోస్త్ లో ధరఖాస్తు చేసుకున్న వారికి డిగ్రీలో ఆడ్మిషన్లను లభిస్తాయి.