టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశమైంది. మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.

మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొనలేదు. ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న అఖిలపక్ష సమావేశంలో కేటీఆర్ హాజరుకాలేదు.