Asianet News TeluguAsianet News Telugu

నీటి వాటాపై పార్లమెంట్‌లో నిలదీయండి: ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం

ఈ నెల 19 నుంచి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల  సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ అయ్యింది. ఈ సందర్బంగా ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 
 

trs parliamentary party meeting ends ksp
Author
Hyderabad, First Published Jul 16, 2021, 9:55 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. లోక్‌సభ, రాజ్యసభలలో నీటి వాటాపై కేంద్రాన్ని నిలదీయాలని ఆయన ఎంపీలను ఆదేశించారు. విభజన హామీలు నెరవేర్చే దిశగా పోరాడాలని కేసీఆర్ సూచించారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని సీఎం పేర్కొన్నారు. అలాగే కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.  రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. 

Also Read:బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు:టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చ

Follow Us:
Download App:
  • android
  • ios