టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు గురువారం లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్  బర్లాను కలిశారు. టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వారు స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను కలిశారు.

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలని లేవనెత్తి కొందరు సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు.

పలువురు సభ్యులు లేవనెత్తిన రాష్ట్రానికి సంబంధించిన అంశాలను రికార్డ్ ల నుంచి తొలగించాలని ఈ సందర్భంగా వారు స్పీకర్ ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించేదుకు అసెంబ్లీలు ఉన్నాయి కదా అని వారు స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించేదుకు అసెంబ్లీలు ఉన్నాయని స్పష్టం చేసిన ఎంపీలు.