హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద భూ కబ్జాదారుడు అంటూ నిప్పులు చెరిగారు. 

అంతేకాదు ఆయన పెద్ద దొంగ అంటూ ఘాటు విమర్శలు చేశారు. తనపై విశ్వేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలు దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనను ఓడించానని గొప్పలు చెప్పుకుంటాన్నాడని అయితే తాము కూడా ఆయన్ను ఓడించిన విషయాన్ని మరచిపోతున్నారని ఎద్దేవా చేశారు.