Asianet News TeluguAsianet News Telugu

కవితను కలవడానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు (వీడియో)

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం మొత్తం ప్రచారాన్ని మొత్తం తమ భుజాలపై వేసుకుని అభ్యర్థులను గెలిపించుకున్నారని అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో పార్టీ అభ్యర్థులను గెలిపించేకునే బాధ్యత తీసుకున్న ఎంపి కవిత సఫలీకృతమయ్యారు. ఉమ్మడి జిల్లాలోని ఎల్లారెడ్డి ఒక్కటి మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్ధులే గెలుపొందారు. దీంతో తమ గెలుపు కోసం కృషి చేసిన కవితను కలుసుకోవడానికి ఎమ్మెల్యేలంతా ఆమె ఇంటికి క్యూ కడుతున్నారు. 

trs mlas met mp kavitha In office
Author
Hyderabad, First Published Dec 13, 2018, 3:03 PM IST

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం మొత్తం ప్రచారాన్ని మొత్తం తమ భుజాలపై వేసుకుని అభ్యర్థులను గెలిపించుకున్నారని అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో పార్టీ అభ్యర్థులను గెలిపించేకునే బాధ్యత తీసుకున్న ఎంపి కవిత సఫలీకృతమయ్యారు. ఉమ్మడి జిల్లాలోని ఎల్లారెడ్డి ఒక్కటి మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్ధులే గెలుపొందారు. దీంతో తమ గెలుపు కోసం కృషి చేసిన కవితను కలుసుకోవడానికి ఎమ్మెల్యేలంతా ఆమె ఇంటికి క్యూ కడుతున్నారు. 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లానుండి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్, షకీల్, గణేష్ గుప్తా, గంప గోవర్ధన్ లు కవితను కలిసిన వారిలో వున్నారు. అలాగే రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుండి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మర్యాదపూర్వకంగా కవితను కలిశారు. అరికెపూడి గాంధీ, చంటి క్రాంతి కిరణ్, మల్లారెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, బొల్లం మల్లయ్య యాదవ్, కాలేరు వెంకటేశ్ లు కూడా కవిత ను కలిశారు. ఇలా నాయకుల తాకిడి అధికంగా ఉండటంతో ఎంపి ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. 

"

ఇలా తనను కలవడానికి వచ్చిన నాయకులందరితో దిగిన ఫోటోలను కవిత తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ...తనను కలవడానికి వచ్చిన ఎమ్మెల్యేలందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ ట్వీట్ చేశారు. 

కొత్తగా గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇంకా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం రాకపోవడంతో కేటీఆర్, హరీష్, కవిత లను కలుసుకుంటున్నారు. మర్యాదపూర్వకంగా కలుసేవారితో పాటు మంత్రి పదవుల కోసం సిపారసు చేసుకోవాలనుకునే నాయకులు ఇందులో ఉంటున్నారు. ఈ నెల 18 న మంత్రి మర్గ విస్తరణకు ముహూర్తం ఖరారవడంతో ఆశావవహులు కీలక నాయకుల ఇళ్లవద్ద క్యూ కడుతూ కనిపిస్తున్నారు.   

Follow Us:
Download App:
  • android
  • ios