కోరుట్ల: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ ఈ వ్యాఖ్యల విషయంలో వెనక్కు తగ్గారు.

తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఆయన కోరారు.  అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాల విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పినట్టుగా ఆయన తెలిపారు.

తాను రాముడిని భక్తుడినేనని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అయోధ్యకు కూడ వెళ్లినట్టుగా ఆయన తెలిపారు. బీజేపీ మత రాజకీయాలు మానుకొంటే మంచిదని ఆయన హితవు పలికారు. అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణానికి తాను విరాళం ఇస్తానని ఆయన చెప్పారు.