Asianet News TeluguAsianet News Telugu

రామమందిరానికి విరాళాలు ఇవ్వొద్దు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అయోధ్య రామమందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో కట్టే రామమందిరానికి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారాయన. మన వూళ్లోనే గుళ్లు కట్టుకుందామని పిలుపునిచ్చారు. 

TRS mla vidyasagar rao sensational comments on ayodhya ram mandir ksp
Author
Hyderabad, First Published Jan 21, 2021, 4:37 PM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అయోధ్య రామమందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో కట్టే రామమందిరానికి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారాయన. మన వూళ్లోనే గుళ్లు కట్టుకుందామని పిలుపునిచ్చారు.

అసలైన రామ భక్తులం తామేనని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతలే భక్తి లేనివాళ్లంటూ విద్యాసాగర్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణలో కులాల వారీగా దేవుళ్లు వున్నారని ఆయన గుర్తుచేశారు.

ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇబ్బందులు పడుతుంటే కేంద్రం ఆదుకోలేదన్నారు. విద్యాసాగర్ రావు వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

మరోవైపు ఆయన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు బీజేపీ నేత, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన విద్యాసాగర్ రావు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

స్వచ్ఛందంగానే రామ మందిరానికి విరాళాలు ఇవ్వాలని కోరుతున్నామని... ఇందులో ఎలాంటి బలవంతం లేదని రాజాసింగ్ తేల్చి చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios