తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అరుదైన నాయకుడు, సాహసం, నిబద్ధత కలిగిన పోరాట యోధుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అంతకు కేటీఆర్ తల్లి శోభా, సతీమణి శైలిమా, కుమార్తెతో కలిసి ప్రగతి భవన్‌లో మొక్కలు నాటారు.