Asianet News TeluguAsianet News Telugu

మాతో టచ్‌లో టీఆర్ఎస్ డిప్యూటీ సీఎం స్థాయి నేతలు:పొన్నం ప్రభాకర్

త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ ఎస్ నుంచి భారీ స్థాయిలో వలసలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లో డిప్యూటీ సీఎం స్థాయి నేతలు దగ్గర నుంచి ఐఏఎస్ అధికారుల వరకు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఓ నియంత అని నియంత దగ్గర ఉండలేమన్న భావన చాలామంది టీఆర్ఎస్ నేతల్లో ఉందన్నారు. 
 

Trs main leaders and ias officers touch with congress
Author
Karimnagar, First Published Oct 16, 2018, 3:11 PM IST

కరీంనగర్‌: త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ ఎస్ నుంచి భారీ స్థాయిలో వలసలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లో డిప్యూటీ సీఎం స్థాయి నేతలు దగ్గర నుంచి ఐఏఎస్ అధికారుల వరకు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఓ నియంత అని నియంత దగ్గర ఉండలేమన్న భావన చాలామంది టీఆర్ఎస్ నేతల్లో ఉందన్నారు. 

కరీంనగర్ జిల్లాను ఏడు ముక్కలు చేసిన టీఆర్‌ఎస్‌ను గద్దెదించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకరు ధన బలంతో, మరొకరు మతాన్ని అడ్డు పెట్టుకుని గెలవాలని చూస్తున్నారని ఘాటుగా విమర్శించారు. 

ఈ ఎన్నికల్లో కరీంనగర్‌లో కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. గతంలో కరీంనగర్‌ ప్రజలకు తామిచ్చిన హామీలన్నీ నేరవేర్చామని గుర్తు చేశారు. కానీ కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని తీవ్రంగా మండిపడ్డారు.

కరీంనగర్‌ ప్రజల కోసం స్థానిక మేధావులతో కలిసి లోకల్‌ మేనిఫెస్టో రూపొందించనున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ మార్పిడి ఖాయమని పొన్నం జోస్యం చెప్పారు. అమావాస్య నాడు జరిగే ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తప్పదన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios