తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు మూడు రౌండ్ల ఫలితాలు విడుదలవ్వగా.. టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. తొలుత టగ్ ఆఫ్ వార్ గా మొదలవ్వగా.. ఇప్పడుు వార్ వన్ సైడ్ అయినట్లు కనపడుతోంది. ప్రత్యర్థులకు దరిదాపుల్లో కూడా లేకుండా టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది.

అప్పటి వరకు ఫలితాలపై టెన్షన్ లో ఉన్న టీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. తమ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. సంబరాలు మొదలుపెట్టేశారు. తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.  కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలందరూ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. వీరందరి మీదా.. టీఆర్ఎస్ ముందంజలో ఉంది.

తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 7వ తేదీన జరిగిన పోలింగ్‌ ఫలితాలు మరికొద్దిసేపట్లో వెల్లడి కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో సుమారు 40వేలకు పైగా సిబ్బంది ఉన్నారు.