Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ఓడినందుకు 101 కొబ్బరికాయలు కొట్టిన ఆ పార్టీ నేత..!?

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే 101 కొబ్బరికాయలు కొడతానని ఆ పార్టీ నేత మొక్కుకోవడం, ఫలితాలు రాగానే మొక్కుతీర్చుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గోదాల రంగారెడ్డి. గత 20 యేళ్లుగా రాష్ట్ర స్థాయిలో అనేక పదవులు చేపట్టారు. 

TRS leader breaks 101 coconuts due to failure in dubbaka - bsb
Author
hyderabad, First Published Nov 11, 2020, 12:22 PM IST

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే 101 కొబ్బరికాయలు కొడతానని ఆ పార్టీ నేత మొక్కుకోవడం, ఫలితాలు రాగానే మొక్కుతీర్చుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గోదాల రంగారెడ్డి. గత 20 యేళ్లుగా రాష్ట్ర స్థాయిలో అనేక పదవులు చేపట్టారు. 

గతంలో టీడీపీ నుంచి కౌన్సిలర్ గెలుపొందాడు. ఆయన భార్య గోదాల భారతమ్మ టీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ గా గెలుపొందింది. ఇప్పటికీ టీఆర్ఎస్ లోనే రంగారెడ్డి కొనసాగుతున్నాడు.  స్థానికంగా పార్టీలో ఉన్న అంతర్గత వివాదాల వల్ల గతకొంత కాలంగా క్షేత్రస్థాయి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు.

టీఆర్ఎస్‌పై ఉన్న అసహానంతో దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతే 101 కొబ్బరి కాయలు కొడతా అని తెలంగాణలోనే రెండో అతి పెద్దదైన పెద్దగట్టు లింగమంతుల స్వామికి మొక్కుకున్నాడు. 

మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడంతో గోదాల రంగారెడ్డి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు. పార్టీలోనే ఉండి పార్టీ ఓటమిని కోరుకున్న ఆయన తీరుపట్ల పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios