హైదరాబాద్: ముస్లిం, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు విషయమై కేంద్రాన్ని పార్లమెంట్‌లో నిలదీయాలని పార్టీ ఎంపీలకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదేశించారు.

గురువారం నాడు ప్రగతి భవన్‌లో  టీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమైన నిధులను కేంద్రం నుండి  వచ్చేలా పోరాటం చేయాలని కేసీఆర్ పార్టీ ఎంపీలను కోరారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిందిగా కోరారు. 

వ్యవసాయానికి  ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ విషయమై టీఆర్ఎస్ అభిప్రాయాన్ని పార్లమెంట్‌లో  విన్పించాలని  ఆయన కోరారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను  టీఆర్ఎస్ కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం కావాలని  కేసీఆర్ ఎంపీలను కోరారు.

సంబంధిత వార్తలు

కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై అనర్హత వేటు: స్పీకర్‌కు ఫిర్యాదు