Asianet News TeluguAsianet News Telugu

మోదీ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు: కేసీఆర్ వార్నింగ్

భారతదేశ ప్రధాని నరేంద్రమోదీపై టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ మోదీపై విరుచుకుపడ్డారు. తెలంగాణ వచ్చి ఇష్టం వచ్చినట్లు అబద్దాలు చెప్పొద్దన్నారు. 
 

trs chief kcr warns to pm narendramodi
Author
Narsapur, First Published Nov 28, 2018, 6:27 PM IST

నర్సాపూర్: భారతదేశ ప్రధాని నరేంద్రమోదీపై టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ మోదీపై విరుచుకుపడ్డారు. తెలంగాణ వచ్చి ఇష్టం వచ్చినట్లు అబద్దాలు చెప్పొద్దన్నారు. 

బీజేపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవి అంతా అబద్దాలే చెప్తున్నారని మండిపడ్డారు. మోడీ పెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం పనికిమాలని పథకం అన్నారు. కంటి వెలుగు లాంటి పథకం ఏ రాష్ట్రంలోనైనా అమలులో ఉందా అని నిలదీశారు. కేంద్ర పథకాలకన్నా మంచి పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఏ రాష్ట్రంలోనైనా అమలు జరుగుతున్నాయా అంటూ కేసీఆర్ మోదీకి సవాల్ విసిరారు. ఎన్నికలంటే కుల గజ్జి, మతగజ్జి, డబ్బు సరఫరా ఎక్కువై పోయిందన్నారు.

టీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకమైన మానవీయ కోణంలో ఆలోచించి పెట్టిన పథకమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. పేదింట్లో ఆడపిల్ల పెళ్లికి ఏ రాష్ట్రంలోనైనా లక్ష 16వేలు రూపాయలు ప్రభుత్వం ఇస్తుందా అని కేసీఆర్ నిలదీశారు. 

తెలంగాణలో తప్ప ఇంకెక్కడైనా కళ్యాణ లక్ష్మీ పథకం ఉందా అన్నారు. రైతులు ధనవంతులు అయ్యే వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మోడీకి స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో అన్ని అసత్యాలే చెప్పారని కేసీఆర్ ఆరోపించారు.

ఎన్నికలు వస్తే ఎన్నో పార్టీలు వస్తాయని ఏవేవో హామీలు ఇస్తాయని కేసీఆర్ తెలిపారు. అయితే పరిణితితో ఆలోచించి ఓటెయ్యాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్,టీడీపీ రాజ్యం చూశారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ రాజ్యం చూశారు. ఏ పార్టీ అభివృద్ధి చేసిందో ప్రజలు గమనించాలని కోరారు. 

నర్సాపూర్ నియోజకవర్గంలో లక్ష ఎకరాల్లో సాగునీరు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. నర్సాపూర్ నియోజకవర్గం చైతన్యవంతమైన నియోజకవర్గమని ఆలోచించి టీఆర్ ఎస్ పార్టీకి ఓటెయ్యాలని కోరారు. చిలుముల మదన్‌రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios