Asianet News TeluguAsianet News Telugu

ఉత్తమ్ పనికిమాలిన దద్దమ్మ, పొడవున్నాడు కానీ బుర్రలేదు:కేసీఆర్

కాంగ్రెస్సోళ్ల బతుకులు చేతి సంచులు మోసి బతికిన బతుకులని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆరోపించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుతగిలిందన్నారు. 
 

trs chief kcr fires on congress
Author
Zaheerabad, First Published Nov 28, 2018, 3:56 PM IST

జహీరాబాద్: కాంగ్రెస్సోళ్ల బతుకులు చేతి సంచులు మోసి బతికిన బతుకులని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆరోపించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుతగిలిందన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఊహించనటువంటి పాలన అందించామన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రం అమలు చెయ్యడం లేదన్నారు.  

అయితే తాము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్, ఇతర పార్టీల వెన్నులో వణుకుపుట్టిందన్నారు. దాంతో తమ పార్టీపై అవినీతి ఆరోపణలు చేశారని విమర్శించారు. ఆ ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపించాలని తాము సవాల్ విసిరినా ఒక్కరూ కూడా ముందుకు రాలేదన్నారు. 

 తెలంగాణకు సాగునీరు కొరత ఉందని పేరుకు ప్రాజెక్టులు ఉన్నా తెలంగాణకు మాత్రం ఏ మాత్రం ఒరగడం లేదని గమనించినట్లు తెలిపారు. రిటైర్డ్ ఇంజనీర్లు, మేధావులు గోదావరి బేసిన్, కృష్ణా బేసిన్ లలో పర్యటించి ప్రాజెక్టుల రూపకల్పనలకు కృషి చేశారన్నారు. 

మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లు రూపొందించిన వివరాలను ప్రాజెక్టుల పనితీరుపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశానని అయితే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పారిపోయిందని చెప్పారు. ప్రతిపక్ష హోదాలో ఉండి నిలదియ్యాల్సిన కాంగ్రెస్ పార్టీ పారిపోయిందన్నారు.  

అసెంబ్లీలో సాగునీరు తాగునీరు వంటి అంశాలపై చర్చిస్తుంటే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ కాలేదని చెప్పాడని కేసీఆర్ ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, తాను మాట్లాడుతుంటే ప్రిపేర్ కాలేదన్నాడని విమర్శించారు. మ

రి అసెంబ్లీకి వచ్చింది ఎందుకు  అని నిలదీశారు. పీకనీకి వచ్చావా అంటూ ఘాటుగా విమర్శించారు. కడుపులో తెలంగాణ లేదు, తెలంగాణ ఉంటే ఎందుకు ప్రిపేర్ అవ్వాల్సి ఉండేదన్నారు. గీతారెడ్డి, బీతారెడ్డి లాంటి వాళ్లు నేడు అడ్డం నిలువు, పొడవు గురించి చాలా మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. 

అసెంబ్లీలోనూ బయట పేగులు తెగేలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోరాటం చేస్తుంటే, గీతారెడ్డి కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ పట్టించుకోలేదన్నారు.  ఆరామ్ సే రెస్ట్ తీసుకున్నారని మండిపడ్డారు. 

కాంగ్రెస్ నేతల బతుకులు చేతి సంచులు మోసి బతికిన బతుకులని మండిపడ్డారు. పాలుకారే తెలంగాణను, బంగారు పిచ్చుకను జవహర్ లాల్ నెహ్రూ ఆంధ్రాలో కలిపారన్నారు. 1956లోనే తెలంగాణ 63 కోట్లు మిగులు బడ్జెట్ లో ఉందన్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాజెక్టు కట్టినా ఆంధ్రాకు న్యాయం జరిగేదే తప్ప తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. అలాంటి సమయంలో తెలంగాణ కోసం పోరాటం చేస్తే 400 మందిని పిట్టలను కాల్చినట్లు కాల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆరోపించారు. 

తెలంగాణ ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీతో పొత్తుపెట్టుకుని 14 ఏళ్లు కాలయాపన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆఖరికి తన పోరాటంతో గత్యంతరం లేక తెలంగాణ ఇచ్చారన్నారు. 

ఒక వేళ తెలంగాణపై ప్రేమ ఉంటే 2005లోనో ఇవ్వాలని చెప్పారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీపై గౌరవం పోయిందన్నారు. 2014 న్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించారో తెలుసుకోవాలన్నారు. ఇలాంటి పరిస్థితులు గురించి తెలుసుకోక అడ్డం పొడవు గురించి ఆ గాంధీ, ఈ గాంధీలు మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. 

మరోవైపు కాంగ్రెస్ నేతలు తెలివిలేని దద్దమ్మలు అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు అవినీతి పరులంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ స్కామ్ లు చేశారు కాబట్టే తాము చేశామనుకుంటున్నారని ఆరోపించారు. అవినీతి కాంగ్రెస్ పార్టీ నేతలుదరిద్రులు అంటూ ఘాటుగా విమర్శించారు. 

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆదాయం పెంచామని తెలిపారు. అయితే ఇవేమీ తెలియని దద్దమ్మలు మాత్రం అప్పులు చేశారని చెప్తున్నారని విమర్శించారు. మనకంటే 14రాష్ట్రాలు దేశంలో అప్పులు చేశాయన్నారు. కానీ మనం ఆఖరిన ఉన్నాం అన్నారు. నాలుగేళ్లలో రూ.2057 కోట్లు ఇసుకపైనే సాధించామన్నారు. 

గీతారెడ్డి ఏనాడైనా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిందా అని నిలదీశారు. గతంలో గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారని అప్పుడు ఎలా ఉంది గజ్వేల్ నియోజకవర్గం తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గజ్వేల్ ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు. 

తనలా గీతారెడ్డి మాట్లాడగలదా అని సవాల్ విసిరారు. ఏదో మాట్లాడాలని మాట్లాడుతుందే తప్ప వాస్తవాలు ఆమెకి తెలియదన్నారు. నాలుగున్నరేళ్లలో ప్రజా సమస్యలపై ఏనాడైనా స్పందించారా అంటూ నిలదీశారు. జహీరాబాద్ నియోజకవర్గంలో పవర్ హాలిడే ఉండేదని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటూ నిలదీశారు. 

వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలని ఆ తర్వాతే ఓటు వెయ్యాలన్నారు. తాను చెప్పింది అబద్దమైతే తమకు ఓటెయ్యోద్దన్నారు. మాణిక్యరావుకి డిపాజిట్ లేకుండా చెయ్యండన్నారు. ఇకపై జహీరాబాద్ నియోజకవర్గాన్ని తాను దగ్గర ఉండి చూసుకుంటానన్నారు. సింగూరు జలాలతో నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు.   

Follow Us:
Download App:
  • android
  • ios